జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీస్ అధికారుల కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి-ఎస్పీ


భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్:


జిల్లా పోలీసులందరికీ ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్


జిల్లాలోని అన్ని పోలీస్ కార్యాలయాలు మరియు పోలీస్ స్టేషన్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు ఈ రోజు తమ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకొని,భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించవచ్చని ఈ సందర్బంగా ఎస్పీ తెలియజేసారు.భవిష్యత్ తరాలకు నీటి కొరత ఏర్పడకుండా వర్షపు నీటిని ఆదా చేసుకుంటూ ప్రజలందరూ బాధ్యతగా తమ నివాస ప్రదేశాలలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు.ఇందులో భాగంగానే జిల్లా పోలీస్ కార్యాలయాల్లో మరియు పోలీస్ స్టేషన్ల ప్రాంగణాలలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునే విధంగా అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు.


Also Read: Great  దేవతమ్మ లాంటి డాక్టరమ్మ...

Post a Comment

కొత్తది పాతది