R&B మరియు ఐటీడీఏ ఇంజనీరింగ్ నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు
నియోజకవర్గ రోడ్ల పరిస్థితిపై R&B అధికారులను ఆరా తీసిన ఎమ్మెల్యే పాయం
గిరిజనుల సంరక్షణకై ITDA అధికారులు కృషి చేయాలి ఎమ్మెల్యే పాయం
మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు R&B మరియు ఐ టి డి ఎ ఇంజనీరింగ్ నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు కట్టడాలు, వాటి యొక్క నాణ్యత పై, రోడ్స్ నిర్మాణం మరియు పలు ప్రభుత్వ భవనాలు కట్టడాలపై నియోజకవర్గ రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు, గిరిజనుల సంక్షేమం కొరకు చేపట్టే పలు కార్యక్రమాలపై ఆరా తీశారు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పటుగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారులు ముందు ఉండాలని అధికారులను ఆదేశించిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు*
ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి R&B మరియు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి