పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలంలో ప్రస్తుతం వర్షాలు పడి, వరి కోతలకు ఆటంకాలు కలుగుతున్నాయి. స్థానిక రైతులు కోత దశలో ఉన్న పంటలు తడవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో కొన్ని రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, దీనివల్ల పినపాకలో కోత దశలో ఉన్న వరి పొలాలకు నష్టం వచ్చే అవకాశం ఉంది.
పినపాక మండలంలోని రైతులు ఇప్పటికే కోత ప్రారంభించి, వరి ఆరబెట్టే పనుల్లో ఉన్న సమయంలో వర్షాలు కురవడంతో ధాన్యం తడిచాయి.
వాతావరణ నివేదికల ప్రకారం పినపాకలో మేఘావృత వాతావరణం కొనసాగి, రాబోయే రోజులలో కూడా మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి, దీంతో కోతలు పూర్తికావడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి