పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
పినపాక మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి పరిధిలో గల ఇప్పల గుంపు గ్రామంలో వైద్యాధికారిని దుర్గ భవాని ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంటోమ్యాటిక్ ఫీవర్ సర్వేలో భాగంగా.. గ్రామస్తులందరికీ రక్తపూతలు, ఆర్డిటి పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటీఎస్ మాట్లాడుతూ... గ్రామ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వేడిగా ఉండే ఆహారమే తినాలన్నారు. ఏదైనా జ్వరం, ఇతర ఆరోగ్య సమస్య వస్తే వెంటనే పినపాక పిహెచ్సి సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.
إرسال تعليق