TG: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించాలని లక్ష్యంతో రాజీవ్ యువ వికాస్ పథకం ప్రవేశపెట్టారు.
అర్హులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అందుతుందని ప్రభుత్వం చెప్తోంది.
రాజీవ్ యువ వికాస్ పథకానికి సిబిల్ స్కోర్ తో పనిలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మరి కొద్ది రోజుల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా 13.45 లక్షల మంది యువత ఈ పథకానికి అప్లై చేసుకొని ఉన్నారు.
రాజీవ్ యువ వికాసం కు సీబిల్ స్కోర్ తో పని లేదు...
*లేనిపోని అపోహలు వద్దు....* *డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క:---* *మంగళవారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న 33/11కె.వి విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన కార్యక్రమం స్థానిక ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్
జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ తో జిల్లా పోడు భూముల సమస్యలపై ఆరా తీశారు. అలాగే ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకు వారి స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం ప్రారంభిస్తున్నామని ప్రస్తుతం ఈ పథకం పై బ్యాంక్ క్రెడిట్ స్కోర్ పై అనేక అపోహలు వస్తున్నాయని, అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. స్కోరింగ్ తో పని లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తిస్తుందని, జూన్ 2 తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు.
ఇది కూడా చదవండి...
బ్రేకింగ్ న్యూస్... యువతి అదృశ్యం
కామెంట్‌ను పోస్ట్ చేయండి