సింగరేణి మణుగూరు ఏరియాలో పర్సనల్ డిపార్ట్‌మెంట్ సమీక్షా సమావేశం

 




మణుగూరు ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, మణుగూరు ఏరియాలో పర్సనల్ డిపార్ట్‌మెంట్ పనితీరుపై సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. జనరల్ మేనేజర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీజీఎం (పర్సనల్) శ్రీ ఎస్. రమేష్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏరియాలోని సంక్షేమ అధికారులు, పి.ఓ.ఏలు మరియు ఆయా డిపార్ట్‌మెంట్ల మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశం ప్రారంభంలో, డీజీఎం శ్రీ ఎస్. రమేష్ 2023 మరియు 2024 సంవత్సరాలలో విధులకు గైర్హాజరైన కార్మికుల చార్జిషీట్ ఎంక్వైరీ ప్రక్రియను సమీక్షించారు. అనంతరం, వివిధ కారణాలతో చార్జిషీట్ పొందిన ఉద్యోగుల ఎంక్వైరీల ప్రస్తుత స్థితిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ విభాగం విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని నొక్కిచెప్పారు.

సమావేశంలో డీజీఎం శ్రీ ఎస్. రమేష్ ఇచ్చిన ముఖ్య సూచనలు:

కారుణ్య నియామకాలు: 31.12.2024 లోపు పీకేఓసీ, కేపీయూజీ, ఎంఎన్ఓసీపీ, కేసీహెచ్‌పీ, ఏరియా వర్క్‌షాప్, ఏరియా హాస్పిటల్ మరియు ఇతర విభాగాలకు సంబంధించిన కారుణ్య నియామకాలు/మాజీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, సకాలంలో క్లెయిమ్‌లు పూర్తి చేయించాలి.

పదవీ విరమణ ప్రయోజనాలు: ఉద్యోగుల పదవీ విరమణ బెనిఫిట్స్, సీఎంపీఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ, అలాగే హెచ్‌బీఏఎల్‌ఐఆర్‌ఎస్/సీపీఆర్‌ఎంఎస్ క్లెయిమ్‌ల కొరకు సంబంధిత ఉద్యోగుల నుండి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి, సకాలంలో క్లియర్ చేయాలి.

కోర్టు కేసులు: కోర్టు కేసుల పురోగతి వివరాలను వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.

సాలరీ అకౌంట్లు: సింగరేణి ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల కార్పొరేట్ సాలరీ అకౌంట్ ఓపెనింగ్ వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలి.

గైర్హాజరుపై కౌన్సెలింగ్: ప్రతి నెల 5వ తేదీ లోపు గైర్హాజరైన ఉద్యోగులకు ఉద్యోగం విలువ తెలిసేలా కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించాలి.

క్వార్టర్స్ డిజిటలైజేషన్: క్వార్టర్స్ కేటాయింపు, పీనల్ రెంట్-హెచ్‌ఎస్‌ఏ, క్వార్టర్స్ వివరాలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేయాలి. అర్హులైన పెన్షన్ హోల్డర్లకు రివైజ్డ్ పీపీఓ జారీ చేయడానికి సంబంధించిన పత్రాల సేకరణ వివరాలు తెలుసుకోవాలి.

కేడర్ స్కీమ్ ప్రమోషన్లు: కేడర్ స్కీమ్ ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి.

ఆన్‌లైన్ పోర్టల్స్ వినియోగం: సీఎంపీఎఫ్ పోర్టల్ మరియు ఉద్యోగ పర్సనల్ వివరాలతో కూడిన ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ వినియోగంపై ఉద్యోగులలో అవగాహన పెంపొందించాలి.

మాజీ ఉద్యోగుల సేవలు: మాజీ ఉద్యోగులు సీపీఆర్‌ఎంఎస్ మరియు పెన్షన్ రెన్యువల్ కొరకు మీసేవ కేంద్రాలలో రెన్యువల్ చేసుకోవాలని తెలియజేయాలి.

వీఐపీ దరఖాస్తులు: వీఐపీ/వీవీఐపీల ద్వారా వచ్చిన దరఖాస్తులను సంబంధిత వెబ్‌సైట్‌లో వెంటనే అప్‌లోడ్ చేయాలి.

పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్, సీనియర్ పర్సనల్ అధికారులు, సంక్షేమ అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేస్తూ, పారదర్శకంగా తమ వంతు సేవలు అందించాలని శ్రీ రమేష్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీనియర్ పీఓలు శ్రీ సింగం శ్రీనివాస్, శ్రీ వి. రామేశ్వర రావు, శ్రీ డి. నరేష్, మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్) శ్రీమతి సాయి శ్వేత, శ్రీ అరుణ్ తేజ, శ్రీ వంశీ కృష్ణ, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీ పి. లక్ష్మణ్ రావు, శ్రీ మధు, శ్రీ ఎం. నరసింహ రావు, శ్రీ ఎన్వీ రావు, ఓసీ-4 పీఏ శ్రీ ఎండి షాబుద్దీన్, శ్రీ ఎండి సుభాని, అన్ని విభాగాల మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అధికార ప్రతినిధి & డీజీఎం (పర్సనల్)

మణుగూరు ఏరియా


 ఇది కూడా చదవండి  భారీ గంజాయి పట్టివేత


మావోయిస్టు పార్టీ సంచలన లేక

Post a Comment

కొత్తది పాతది