ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మరుగున పడుతున్న ఆదిమ తెగ పట్టెడ కోయ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు- అధ్యయనం అనే అంశంపై ఆదివాసి ముద్దుబిడ్డ కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి పంచాయతీ వీరాపురం గ్రామానికి చెందిన కుంజా వరలక్ష్మి w/o వజ్జా నరసింహారావు ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీల్ పరిశోధన ఆధారంగా రూపొందించిన పుస్తకాన్ని తెలంగాణ పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా మంగళవారం హైదరాబాద్ ప్రజా భవన్ లో ఆవిష్కరించడం జరిగినది. ఆదిమ కాలం నాటి ఆదివాసి తెగలు కాలక్రమమైన మరుగున పడుతున్న తరుణంలో ఆదివాసి ఆణిముత్యం కుంజా వరలక్ష్మి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన జ్ఞానపీఠంలో ప్రాజెక్టు ఫెలో గా ఆచార్య బట్టు రమేష్ పర్యవేక్షణలో పట్టెడ కోయ గిరిజన సాంస్కృతి సాంప్రదాయలు- అధ్యయనం అనే అంశంపై సమగ్ర సాహిత్యంతో గ్రంథాన్ని రూపొందించడం అభినందనీయం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సామెత ఆదివాసి ఆడబిడ్డ కుంజా వరలక్ష్మి పట్టుదల కృషికి నిదర్శనం అని అన్నారు. అంతరించిపోతున్న ఆదిమ తెగల చరిత్రకు జీవం పోసి సజీవంగా నిలిపేందుకు తాను చేపట్టిన పరిశోధన అధ్యయన గ్రంథంగా భావితరాలకు అందించి బాసటగా నిలిచారని అన్నారు. పూర్వకోయ తెగల చరిత్ర ఎంతో విశిష్టత మైనది. అంతటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన ఆదివాసీ తెగలు ఒకటి పట్టేడ కోయ పూర్వ చరిత్రను వెలికి తీసి జానపద సాహిత్యానికి మూలం తాను రచించిన పుస్తకం ద్వారా ఈ సమాజానికి పరిచయం చేశారని అన్నారు. నాటి కోయ తెగల చరిత్రని నేటి సమాజం అనుసరిస్తూ సంస్కృతి, సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. కోయ తెగల జీవన విధానం సంస్కృతి, సాంప్రదాయాలు సాహిత్యంపై భవిష్యత్తులో విస్తృతంగా అధ్యయనం చేపట్టి భావితరాలకు మౌఖిక సాహిత్యాన్ని అందించవలసిన అవసరం నేటితరం విజ్ఞులైన ఆదివాసి సమాజంపై ఉందని తెలియజేశారు. అనంతరం ఎంపీల్ పరిశోధన పర్యవేక్షకుడు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య బట్టు రమేష్ మాట్లాడుతూ ఆదిమ తెగలైన ఆదివాసులపై విస్తృతంగా పరిశోధనలు చేసి వారి యొక్క పూర్వ చరిత్ర ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, సంగీత కళలను సాహిత్య రూపంలో తీసుకురావడం కోసం తెలుగు విశ్వవిద్యాలయం అన్ని విధాల సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం చందా లింగయ్య దొర మాజీ ఎమ్మెల్యే మరియు జిల్లా పరిషత్ చైర్మన్, ఆదివాసి జేఏసీ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ... ఆదివాసీ తెగలు పూర్వకాలంలోనే పని విభజన, సమిష్టి జీవన విధానాన్ని సమాజానికి పరిచయం చేశారని గుర్తు చేశారు. నేడు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న యువత ఆదివాసీ తెగల యొక్క పూర్వ చరిత్ర, అధ్యయనం చేసి సాహిత్య రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నందుకు అభినంది. భవిష్యత్తు కాలంలో పట్టేడ కోయతో పాటు 9 తెగల ఆదివాసి ప్రజల స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి భావితరాలకు సాహిత్యాన్ని అందించవలసిన బాధ్యత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి ఆడబిడ్డ కుటుంబం , చదువు సమతుల్యంగా భావించి తెలుగు విశ్వవిద్యాలయంలో వికసించిన విద్యా కుసుమ కుంజా వరలక్ష్మి, వజ్జా నర్సింగరావులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో నిజాం కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ఆప్కా నాగేశ్వరరావు, రచయిత సామాజిక విశ్లేషకులు శోభ రమేష్, తెలుగు విశ్వవిద్యాలయం సూపరిటెండెంట్ గట్టుపల్లి రాంబాబు, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ సాగబోయిన పాపారావు, అరేం అరుణ్ కుమార్, లా స్టూడెంట్స్ సోందే అన్సార్, సోలం అనిరుత్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి