ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబానికి తక్షిన సహాయం అందజేసిన - తహసిల్దార్ అద్దంకి నరేష్

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన పూస వెంకటేష్ పూరి ఇల్లు షాట్ సర్క్యూట్ తో దగ్ధం కావడం జరిగింది. సంఘటనా స్థలానికి తహసిల్దార్ అద్దంకి నరేష్ చేరుకొని ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. తక్షణ సహాయం కింద 5000 రూపాయలు, 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. సీతంపేట గ్రామస్తులు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి చరవాణి ద్వారా మాట్లాడి వివరాలు తెలపగా.. బాధిత వెంకటేష్ కుటుంబానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని హామీ ఇచ్చారు.

2 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది