వాలీబాల్ క్రీడలను ప్రారంభించిన కరకగూడెం ఎస్సై రాజేందర్
కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని ఎస్సై రాజేందర్ అన్నారు. ఆదివారం తాటిగూడెం గ్రామం లో గత 13 సంవత్సరాలుగా తాటిగూడెం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రెండు జిల్లాల స్థాయిలో వాలీబాల్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని , ఓడినవారు , గెలిచిన వారిని పూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాకారులు క్రీడాస్పూర్తితో మెలగాలన్నారు.
ఈ కార్యక్రమంలో తాటిగూడెం మాజీ సర్పంచ్ కొమరం విశ్వనాథం, పోలెబోయిన ప్రభాకర్ ఏడిఈ , పూణెం ఉపేందర్, కొమరం తాతారావు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి