పంచాయతీ ఎన్నికల కోసమే గ్రామ సభల పేరుతో డ్రామాలు


పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

★ స్పష్టత ఇవ్వని గ్రామసభలు

★ గ్రామసభలలో ప్రకటించిన జాబితా అర్హులదేనా? మళ్లీ ఎంపిక చేస్తారా


★ ఆందోళనలో దరఖాస్తుదారులు


★ ఏ ఒక్కరికి అన్యాయం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతాం


★ బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి కోలేటి భవాని శంకర్



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: పంచాయతీ ఎన్నికల కోసమే గ్రామ సభలతో ప్రజాపాలన ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక గ్రామంలో నిర్వహించిన గ్రామ సభను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులతో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పినపాకలో విలేకరులతో మాట్లాడుతూ.... ప్రజా పాలన పేరుతో గద్దెనెక్కిన ప్రజా ప్రభుత్వం అబద్దాలతో పాలన కొనసాగిస్తుందని దుయ్యపట్టారు. గ్రామసభలలో పారదర్శకత లోపించిందన్నారు. అమాయక ప్రజల భావోద్వేగంతో రేవంత్ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభలలో అధికారులు చదివిన పేర్లు లబ్ధిదారులవా? కేవలం అర్హత ఉన్న వారివా? అనే అంశంపై స్పష్టత లేదన్నారు. దీనిపై పాలకులు స్పష్టత ఇవ్వాలన్నారు . ప్రభుత్వం అధికారుల తీరుతో తమకు పథకాలు దక్కుతావా అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారని అన్నారు .అధికారులు ప్రకటించిన జాబితాలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ప్రజా ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగడంతో.... దాని నుండి బయటపడడానికి పూటకొక డ్రామా ఆడుతూ... ప్రజలను మభ్యపెడుతుందన్నారు. రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు.ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Post a Comment

కొత్తది పాతది