బాలికల భద్రత రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలి- కలెక్టర్

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భారత ప్రభుత్వం తన అత్యంత ప్రతిష్టాత్మకమైన బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని 22 జనవరి 2015 లో ప్రారంభించింది.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు ఈ పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  పోస్టర్ల ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

బేటీ బచావో బేటీ పఢావో లో ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న ,  సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడం కోసం సిబ్బంది పనిచేయాలన్నారు. 


 ఆడపిల్లలను రక్షించడంతోపాటు లింగ-ఆధారిత అసమానతలను తొలగిస్తూ ఆడపిల్లలకు సరైన పెరుగుదల , విద్యావకాశాలు, పుట్టుక కు సంబంధించి మెరుగైన అభివృద్ధికి అందరూ కృషిచేయాలని కోరారు. బాలికల భద్రత రక్షణ వంటి అంశాలపై ఎక్కువగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.



 ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ  మునగాకు తరచూ తినడం వలన రక్తహీనతకు దూరమవుతారని మునగ మొక్కలు నాటడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అన్నారు . 


బాల్య వివాహాల నిరోధక చట్టాలు గురించి వివరించి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రేమ పేరుతో బాలికలు మోసపోకూడదని కోరారు.


 అవగాహన, ప్రేరణాత్మక మరియు స్ఫూర్తి దాయక విషయాలపై ఇంకా అవగాహన కార్యక్రమాలు నేటి నుండి మార్చ్ 8 వరకు నిర్వహిస్తామని తెలిపారు.


 ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి స్వర్ణలత లెనీనా, బాలల సంరక్షణ అధికారి  హరి కుమారి, మహిళా సాధికారత కోఆర్డినేటర్ సంతోష రూప ,

టి ఎస్ డబ్లు ఆర్ జే సి  విద్యార్థినులు , భారతి , మాధవి 

మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ జాహేద , సాహితీ ,  అకౌంటెంట్ ప్రియాంక,  స్వాతి,  మౌనిక  తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

కొత్తది పాతది