అశ్వాపురం ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం నందు రేపు ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించి ఎమ్మార్వో కి మెమొండారం అందజేయడం జరుగుతుందని అశ్వాపురం మండల BRS పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ,మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు కృషితో మొండికుంట గ్రామపంచాయతీ బీజీ, కొత్తూరు గ్రామంలో నవోదయ పాఠశాల కొరకు భూసేకరణ సంబంధించిన సీసి రోడ్డు మంజూరు చెయ్యడం జరిగింది...కేంద్ర ప్రభుత్వం బిజీ కొత్తూరు గ్రామంలో నవోదయ పాఠశాల కొరకు ఆమోదం తెలిపింది....కానీ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మూర్ఖపు ఆలోచనలతో మండలంలో పెట్టవలసిన నవోదయ పాఠశాలను పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో పెట్టాలనే నిర్ణయాన్ని బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది....అక్కడ రెండు పంటలు పండే రైతులను ఇబ్బంది పెట్టి భూములను సేకరించి ఈ యొక్క నవోదయ పాఠశాలను నిర్మించాలని నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. మండలం పరిధిలోని గొల్లగూడెం గ్రామం నందు గవర్నమెంట్ భూమి లో పాలిటెక్నిక్ కళాశాల ను తీసుకువెళ్లి బూర్గంపాడు మండలంలో పెట్టాలని పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నాము....ఈ యొక్క నిర్ణయన్ని వెనక్కి తీసుకోకపోతే కలిసి వచ్చే పార్టీ లతో భారీ ఎత్తున మండలం లో ధర్నా చెయ్యడం జరుగుతుందన్నారు.
కావున ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,అనుబంధ సంఘ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొనాలని కోరారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి