రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

 ఖమ్మం రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

 ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:


ఖమ్మం రూరల్ మండలంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Post a Comment

أحدث أقدم