పినపాక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .ఎల్ భాస్కర్ నాయక్
• పినపాక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్
పినపాక, డిసెంబర్ 24, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎల్ భాస్కర్ నాయక్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిధిలో గర్భిణీ స్త్రీల వివరాల నమోదు, ఓపి తదితర విషయాలను డాక్టర్ దుర్గాభవానిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు , సిబ్బంది కూడా విధిగా తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారని , గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది దీర్ఘకాలిక పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సూచించారని డాక్టర్ దుర్గ భవాని తెలిపారు. అదే విధంగా తోగ్గుడెం పంచాయతీ లో గల ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరంను కూడా తనిఖీ చేసి సిబ్బంది తీసుకోవాల్సిన విషయాలపై సూచనలు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్, చైల్డ్ హెల్త్ & ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ బాలాజీ నాయక్ , పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దుర్గా భవాని, సిబ్బంది పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి