*విస్తృత వాహన తనిఖీలు..!*
*నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు....!!*
*సీ.ఐ అశోక్ రెడ్డి....*
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు వద్ద సి.ఐ అశోక్ రెడ్డి తన సిబ్బందితో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి