కరకగూడెం, డిసెంబర్ 24 , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 102 వాహనాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తాటిగూడెం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు . నూతన పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్థానికుల తో మాట్లాడుతూ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.. పంచాయతీ కార్యాలయo లోని సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా సేవ చేయాలని కోరారు. ఆరు గ్యారoటీ లను అమలు చేసి చూపిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,500 కే గ్యాస్, రైతులకు 2 లక్షల రూపాయల ఋణ మాఫీ గత ప్రభుత్వం చేయలేని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందని తెలిపారు.అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డలకు పెళ్ళి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదని అన్నారు. అంతే కాకుండా ఏదైనా ఆరోగ్యం బాలేనప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేపించుకునే పరిస్థితి లేని కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో పెద ప్రజలకు సిఎంఆర్ ఫండ్ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు . సిఎంఆర్ పథకం కింద 20 మందికి 6 లక్షల 5 రూపాయలు చెక్ ను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ , మైనింగ్ ఏడి దినేష్ కుమార్, ఎంపీడీవో దేవ వర కుమార్, తాసిల్దార్ నాగ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ తేజ, కారం మధు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కుర్నవల్లి మాజీ సర్పంచ్ పోలెబోయిన తిరుపతయ్య, నియోజక వర్గ నాయకురాలు శ్రీవాణి, బట్టుపల్లి మాజీ సర్పంచ్ తోలే o నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు యర్రా సురేష్, జలగం కృష్ణ, భూక్యా రాందాస్, గోగ్గలి రవి, కరకపల్లి నగేష్, మధు, విష్ణుమూర్తి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి