కేటీఆర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేయాలని జిల్లా అధ్యక్షులు కాంతారావు విజ్ఞప్తి

 కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేయాలని జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విజ్ఞప్తి

మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకులకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి బిఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ,అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా... రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రేపు ఉదయం 11 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విజ్ఞప్తి చేశారు

Post a Comment

కొత్తది పాతది