ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:
పెద్దపులి పేరు నిర్ధారించలేదు. ఇది చతిస్గడ్ రత్నగిరి టైగర్ జోన్ నుండి బయలుదేరింది. ప్రస్తుతం పులి భద్రాద్రి జిల్లా సరిహద్దు నుండి ములుగు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించి ఆ ప్రాంతంలో సంచరిస్తుందని మణుగూరు ఎఫ్డిఓ తెలిపారు. పులి అడుగులను బట్టి చతుస్రాకారం ఉంటే మగ పులి గా, త్రిభుజాకారం గా అడుగులు ఉంటే ఆడ పులి గా గుర్తిస్తామని మణుగూరు ఎఫ్డిఓ సయ్యద్ మల్సుద్ మోహిద్దీన్ తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు సంచరిస్తున్న పులి మగపులి గా గుర్తించామన్నారు.ఈ టైగర్ గత రెండు సంవత్సరాల నుండి ఈ పరిశిర ప్రాంతాల్లో తిరుగుతుంది. ఈ పులి రెండు వేల కిలోమీటర్లు సరిహద్దుల్లో చైన్ బోర్డర్లో తిరుగుతుంటుంది. ప్రస్తుతం బోర్డర్లో ఆడపులులు తప్పనిసరిగా తిరుగుతుంటాయి. ఏ ప్రాంతంలో ఉన్నాయో గుర్తించ పనిలో ఉన్నామని ఎండిఓ అన్నారు. ఇప్పుడు పులి పయనిస్తున్న విధానాన్ని చూస్తే 2021 నవంబర్ డిసెంబర్ నెలలో తిరిగిన ఎంచుకున్న దారిలో మళ్లీ తిరుగుతుంది. పులిపై స్మగ్లర్ల దృష్టి పడకూడదని అడవి శాఖ అధికారులు ఇంత కాలం వెల్లడించలేదు. 2021లో అడవి ప్రాంతంలో ఎలాగైతే సంచరించిందో ప్రస్తుతం అదే దారిలో మళ్ళీ పులి వెళుతుంది. పులి వెళుతున్న తీరును గుర్తించి ముందస్తుగానే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి గ్రామంలో పగలు ,రేయి, గస్తీ కాస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులి తిరిగే ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి అడవిలో దానికి కావాల్సిన ఆహారం దొరికే అవకాశం ఉంది. మనుషులు పైన, పశువుల పైన, మేకల పైన ఏమాత్రం దాడి చేసే అవకాశాలు లేవు. ఒకవేళ పశువులు పులి వెళ్లే దారిలో ఎదురుపడి మృత్యువాత పడక తప్పదు. అలాంటి సంఘటన చోటు చేసుకుంటే రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేందుకు నగదు మా వద్ద పెట్టుకొని తిరుగుతున్నామని మణుగూరు ఎఫ్డిఓ చెప్పారు. స్మగ్లర్లు ,కానీ రైతులు కానీ మృతి చెందిన పశువు కు మందు పెట్టి పులిని చంపే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నందున అడుగడుగునా ముందుగానే మా సిబ్బంది బృందాలుగా ఏర్పడి గట్టి సహారా కాస్తున్నారని తెలిపారు. పెద్దపులిని కాపాడటమే తమ లక్ష్యమని పులిని యధా స్థానానికి వెళ్లేంతవరకు రక్షణగా ఉండడమే మా ప్రధాన ధ్యేయం అన్నారు. పులికి ఎవరైనా హాని కల్పిస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఎఫ్డిఓ హెచ్చరించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి