ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి

 ఆళ్లపల్లి: ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి

ఆళ్లపల్లి మండలంలో అనంతోగుకు చెందిన గలిగ నరేశ్, కృష్ణవేణి దంపతుల పెద్దకుమార్తె గలిగ కిరణ్య(4) నాయనమ్మతో బుధవారం చేను పనులకు ట్రాక్టర్ పై వెళ్లింది. మొక్కజొన్న కంకులు ఏరి రాశులుగా పోసేపనిలో అందరూ నిమగ్నమై ఉన్నారు. ట్రాక్టర్ పై కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తు టైరికింద పడింది. చిన్నారి తల నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم