6 కిలోమీటర్లు ట్రాక్టర్ పై ప్రయాణం...
- నరకాన్ని అనుభవిస్తూ నవజాతిశిశువుకు జన్మనిచ్చిన స్వరూప...
- పాయం సారు మాకు బాటలు వేయండి.... మా బ్రతుకులు మార్చండి..🙏🙏🙏🙏
భద్రాద్రి, ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామంలో దారుణమైన ఘటన శుక్రవారం చోటు చేసుకుందనే చెప్పాలి. ఈసం రూపకు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి కాల్ చేశారు. బురద రోడ్డు కారణంగా 108 వాహనం ఆ గ్రామానికి వెళ్లే పరిస్థితి లేదనే చెప్పాలి. మహిళ పురిటి నొప్పులతో నానా అవస్థపడింది. అరిసే అరుపులకు వేసే కేకలకు గ్రామ ప్రజల గుండె తరుక్కుపోయిందని చెప్పొచ్చు. ఆమె ప్రసవ వేదన వర్ణనాతీతం. పురిటి నొప్పుల బాధను అనుభవిస్తూ స్వరూపకు గ్రామస్తులు మంత్రసానులుగా మారి దేవుడిపై భారమేసి గ్రామంలోనే పురుడు పోశారు.అనంతరం ఆమెను ట్రాక్టర్ పై ఎక్కించి ఆ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో 108 వాహన వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల కోసం 108 వాహనంలో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇకనైనా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్పందించి ఆ గ్రామానికి పక్కా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలని పంచాయతీలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి శూన్యమే అని చెప్పాలి. పాలకులు మారినా కూడా అద్వానమైన రోడ్లే మాకు శరణ్యమని వారు వాపోతున్నారు. పక్కా రోడ్లు ఎప్పుడు నిర్మిస్తారా అని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. కలెక్టర్ సారు మీరైనా స్పందించి మాకు రోడ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నారు.
إرسال تعليق