నా ప్రాణం ఉన్నంతవరకు ఆదివాసీ దళిత భూములకు రక్షణగా ఉంటా....

 


నా ప్రాణం ఉన్నంతవరకు ఆదివాసీ దళిత భూములకు రక్షణగా ఉంటా....

-డా"జాడి రామరాజు నేత ..



ఏటూరునాగారం (డిసెంబర్ 3):

 ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికారప్రతినిధి డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ ఎంపీ బలరాం నాయక్ బంధువులు అయినా ధర్మంసోత్ జగ్గురాం నాయక్ ఫ్యామిలీ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోగల  ములుగు నియోజకవర్గం లోగల ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో ఆకులవారి ఘనపురం శివారులోనిరుపేదలైన రెడ్డి లక్ష్మయ్య భూమి సర్వే నెంబర్ 247/7 గలభూమి ఆక్రమించుకోవడం కోసం నాఖిలీ డాక్యుమెంట్స్ సృష్టించిన జగ్గురాం నాయక్ ఫ్యామిలీ కి మద్దతు ఇస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదాని అన్నారు. అదేవిదంగా బి ఆర్ ఎస్  జిల్లా అధ్యక్షులు కాకుల మరి లక్ష్మణ్ బాబు అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి అనుచరుల అవినీతి అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోతున్నాదని అన్నారు .

అదేవిదంగానాటి జిసిసిఉద్యోగిగా అవినీతిఅక్రమాలకుపాల్పడి ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారో జిసీసీలోజగ్గురాం నాయక్ తో ఉద్యోగంచేసినవారిని తెలుసుకోండి ప్రభుత్వఅధికార్లతో పాటు అధికారపార్టీ నాయకులు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్  షోషల్ మీడియా అడ్వాటిజింగ్ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షమా శాఖ మంత్రి తో పాటు మంత్రి అనుచరుల దారంసొత్ జగ్గురాం నాయక్ ఫ్యామిలీ చరిత్ర తెలుసుకొని మద్దతూ ఇస్తే బాగుంటది అన్నారు.అదేవిదంగా ఎంపీ మంత్రి అనూషర్లకు తెరాస జిల్లా అధ్యక్షులుకాకులమరి లక్ష్మణ్ బాబు అనుచరులకు చిత్త శుద్ధి ఉంటే ఏటూరునాగారంగ్రామ పంచాయతీ పరిధిలో ఆకులవారి ఘనపురం శివారులో సర్వే నెంబర్ 247/7గల భూమి నీ జగ్గురాం నాయక్ ఫ్యామిలీ కిభూమి అమ్మిన వ్యక్తులను తీసుకొచ్చి నిజానిజాలు తెలుసుకొని కాంగ్రెస్ తెరాస నాయకులు మాట్లాడితే బాగుంటదని అన్నారు .అదేవిదంగా నా ప్రాణం ఉండగా తెరాస కాంగ్రెస్ నాయకులు అధికారం అడ్డుపెట్టుకొని నిరుపేదలైన ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల యొక్క సెంట్ భూమి కూడా ఆక్రమించుకునే అవకాశం ఇవ్వననీ బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికారప్రతినిధి డా .జాడి రామరాజు నేత అన్నారు.

Post a Comment

కొత్తది పాతది