భార్య వేధింపులు, 40 పేజీల లేఖ రాసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:


భార్య సతాయింపులు తట్టుకోలేక అతుల్‌ సుభాష్‌ (34) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (Software Engineer) బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మరణానికి ముందు ఆయన ఏకంగా 40 పుటల లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన ఒక కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పని చేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఉంటున్నారు. భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఇ-మెయిల్‌ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పంపించారు. తన నివాసంలో ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మంగళవారం గుర్తించారు.

Post a Comment

కొత్తది పాతది