3 దశల్లో పంచాయితీ ఎన్నికలు

ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ పెట్టెలు సిద్ధం చేశారు.


బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు కలెక్టర్‌ టెండర్లు ఆహ్వానించారు. ఆయా పంచాయతీల్లో ఓటర్లు, వార్డుల సంఖ్య ఆధారంగా వార్డు సభ్యులు, సర్పంచి పదవులకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలను ముందుగానే ముద్రించనున్నారు. బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం గుర్తులు మాత్రమే ఉంటాయి. ఓటర్ల సంఖ్యకు, స్థానాలకు 10 శాతం అదనంగా బ్యాలెట్‌ పత్రాలు ముద్రించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలు కంప్యూటరీకరించారు. వచ్చే జనవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.


ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాలో 5,313 మంది ఉద్యోగుల వివరాలు టీఈ-పోల్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు 6,826 మంది ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ అందించేందుకు మాస్టర్‌ ట్రైనర్స్‌ను ఎంపిక చేశారు. కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ బ్యాలెట్‌ పత్రాలు ముద్రించేందుకు ఖమ్మంలో రెండు ప్రింటింగ్‌ ప్రెస్‌లను ఎంపిక చేసింది. స్టేషనరీ, ఇతర సామగ్రిని జడ్పీ భవనంలోని గోదాములో భద్రపరిచారు.

Post a Comment

أحدث أقدم