గాలివాన బీభత్సం.. దెబ్బతిన్న రేకుల ఇళ్లు, పూరిగుడిసెలు

G Rajashekar
By -
0

 



కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన పాల్వంచ ఎంపీడీవో పి. రాజారావు


EB NEWS/పాల్వంచ: 


పాల్వంచ మండల రూరల్ పరిధిలోని దంతలబోర గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో బుధవారం సాయంత్రం వీచిన భారీ గాలివానకు తీవ్ర నష్టం సంభవించింది. గాలివాన ధాటికి కొన్ని ఇళ్లు దెబ్బతిని కూలిపోగా, పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.


ఘటనపై సమాచారం అందుకున్న పాల్వంచ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పి. రాజారావు దంతలబోర ఎస్సీ కాలనీని సందర్శించారు. గాలివానకు దెబ్బతిన్న ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, జరిగిన నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఎంపీడీవో పి. రాజారావు మాట్లాడుతూ.. గాలివాన కారణంగా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారుల ద్వారా నమోదు చేయించి, అర్హులైన బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


అలాగే విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగిన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపడతామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పి. రాజారావు భరోసా కల్పించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)