భద్రగిరి మార్ట్‌కు రాష్ట్రస్థాయి అవార్డు.. గిరిజన మహిళలకు ఉపాధి కల్పనకు గుర్తింపు

G Rajashekar
By -
0

 



గిరిజన ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పిస్తున్న భద్రగిరి మార్ట్‌కు ‘బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ టూరిజం ప్రాజెక్ట్‌/ప్రొడక్ట్‌’ అవార్డు


EB NEWS/హైదరాబాద్:


గిరిజన ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించడంతో పాటు గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు అందిస్తున్న భద్రగిరి మార్ట్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది.


 హైదరాబాద్‌ లోని శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భద్రగిరి మార్ట్‌కు ‘బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ టూరిజం ప్రాజెక్ట్‌/ప్రొడక్ట్‌’ అవార్డు అందజేశారు.


ఈ అవార్డును ఐటీడీఏ పీవో బి. రాహుల్‌ స్వీకరించారు. గిరిజన ప్రాంతాల్లో తయారయ్యే వివిధ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించడంలో భద్రగిరి మార్ట్‌ కీలకంగా నిలుస్తోంది.

ముఖ్యంగా గిరిజన మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం ద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇప్పటికే 100 మందికి పైగా గిరిజన మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.


గిరిజన ప్రాంతాల ఉత్పత్తులు, మహిళల ప్రతిభకు మార్కెట్‌ కల్పిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. భద్రగిరి మార్ట్‌కు లభించిన ఈ అవార్డు గిరిజన ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం కల్పించే అవకాశముందని పేర్కొన్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)