బాత్రూమ్‌లో కాలు జారి బీటీపీఎస్ ఉద్యోగి మృతి

G Rajashekar
By -
0

 



పినపాక మండలం కొత్త రెడ్డిపాలెంలో విషాద ఘటన


EB NEWS/పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, కొత్త రెడ్డిపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్‌లో కాలు జారి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైన బీటీపీఎస్ ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.


కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొత్త రెడ్డిపాలెంకు చెందిన దొడ్డ సంతోష్ (50) బీటీపీఎస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది.


కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో కొత్త రెడ్డిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)