EB NEWS:తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
నోటీసులు అందుకున్న ఓటర్లకు నేటి నుంచి సెప్టెంబరు 20 వరకు విచారణ నిర్వహించనున్నారు. ఈ నెల 31వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రింటింగ్ ప్రక్రియ పూర్తికానుంది.
అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఈవో కార్యాలయం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది.
విచారణ సమయంలో ఓటర్లు తమకు సంబంధించిన వివరాలను పరిశీలించుకుని, అవసరమైన పత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు.

