మణుగూరు: ఖబర్దార్ రేగా కాంతారావు! పాయం వెంకటేశ్వర్లుని విమర్శించే స్థాయి నీది కాదు- గద్దల రమేష్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్

G Rajashekar
By -
0



EB NEWS/మణుగూరు:


కాంగ్రెస్ పార్టీ పైన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారిపై రేగా కాంతారావు చేసిన అనుచిత వ్యాఖ్యలు పైన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గద్దల రమేష్ గురువారం మణుగూరులోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గద్దల రమేష్ మాట్లాడుతూ నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ప్రజలకు దూరంగా ఉండటానికి కారణమేమిటి రేగా కాంతారావు మీరు ఏం సాధించారని ఈ ర్యాలీలు, ప్రజలకు తెలియజేయాలి సుమారు 25 రోజులు నియోజకవర్గం లేకుండా భయపడి పారిపోయి తిరిగి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా యుద్ధవీరుల ర్యాలీలు చేయించుకున్నావు ఏమి తప్పు చేయనప్పుడు ఇన్ని రోజులు ఎందుకు పారిపోయావు నియోజకవర్గాన్ని వదిలి ఒక మహిళ చేసిన ఆరోపణలు ఏమిటి?మీ ఇద్దరి మధ్య లావదేవులకు సంబంధించిన ఆరోపణలు నిజం కాదా? ఒక్క మహిళ ఫిర్యాదు మేరకు సెక్షన్ 69, 351 (2 ) కింద కేసు నమోదైనట్లు చెబుతున్న నేపథ్యంలో, ఈ అంశాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీపై లేదా? అని గద్దల రమేష్ ప్రశ్నించారు ప్రజాస్వామ్యయుతంగా గెలుపొందిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి పైనా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అనుచితుల వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు, ప్రజా నాయకుడు పాయం వెంకటేశ్వర్లు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి పై శ్రమించే నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడటం హేయమైన చర్య అని గద్దల రమేష్ మండిపడ్డారు.

 ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం, పరుష పదజాలంతో దూషించడం రేగ కాంతారావు రాజకీయ అపక్వతకు నిదర్శనమని అన్నారు 

 పాయం వెంకటేశ్వర్లు గారు ప్రజల పక్షాన నిలబడి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకనే రేఖ కాంతారావు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

 రేఖ కాంతారావు నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో అనైతిక భావాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం మానుకోవాలని, లేదంటే ప్రజలే మళ్లీ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ జాడీ రాంబాబు, జిల్లా కార్యదర్శి నులుకుతాటి శ్రీను, పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ కొట్టే అనిల్ కుమార్, మణుగూరు టౌన్ మండల అధ్యక్షులు, పడుతూరి రవి, బర్ల స్వేతన్, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు, ఇనుముల ఇందు కుమార్, పినపాక మండల అధ్యక్షులు,చిట్టిమల్ల ప్రసాద్, గుండాల మండల అధ్యక్షులు పుష్ప రాజ్,పాల్వంచ టౌన్ అధ్యక్షులు, గోలి సదాశివ, కాకటి నరేష్,గద్దల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)