పినపాకలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం

G Rajashekar
By -
0



 EB NEWS/పినపాక:


పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ వద్ద మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సురేష్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ మైసూర్ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ సందర్భంగా మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు మరియు తదిఇతరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)