వాట్సాప్‌లోనే ఇంటర్ ఫలితాలు – విద్యార్థులకు గుడ్ న్యూస్



EB NEWS/తెలంగాణ:


తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ఫలితాలను నేరుగా మొబైల్‌లోనే, ఎటువంటి వెబ్‌సైట్ లాగిన్ అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.


ఈ సేవ కోసం 8096958096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి. అనంతరం కనిపించే మెనూలో ‘BIE Exam Result’ ఎంపికను ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్, సంవత్సరం, స్ట్రీమ్ వివరాలను నమోదు చేస్తే ఫలితాలు వెంటనే మెసేజ్ రూపంలో అందుతాయి.


ఇంతకుముందు కూడా హాల్ టికెట్లను ఇదే విధంగా వాట్సాప్ ద్వారా అందించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో నుంచే సులభంగా ఫలితాలు తెలుసుకునే అవకాశం లభించింది.


Post a Comment

أحدث أقدم