EB NEWS/తెలంగాణ:
తెలంగాణలో పలు జిల్లాల్లో అకాలంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్కర్నూల్, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో గడిచిన కొన్ని గంటలుగా వర్షం దంచికొడుతోంది.
ఈ వర్షాల కారణంగా కోత దశలో ఉన్న వరి, మక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పొలాల్లో కోసిన పంటలు తడిసి పాడవుతాయేమోనని భయపడుతున్నారు.
అకాల వర్షాలు వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ఇక వాతావరణ శాఖ మరో రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

إرسال تعليق