EB NEWS/మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని ఛాకలి ఐలమ్మ నగర్‌కు చెందిన రాపర్తి అనూష (బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థిని) అనారోగ్యంతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
కొద్ది రోజుల క్రితం అనూషకు టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆరోగ్యం క్షీణించింది. అనంతరం ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాప్తి చెంది బ్రెయిన్ ట్యూమర్‌గా మారడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక చికిత్స పొందుతూ అనూష మృతి చెందింది.
ప్రస్తుతం అనూష హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చదువులో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ ఉన్న ఆమె అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అనూష మృతి వార్త తెలిసిన వెంటనే మణుగూరు ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

إرسال تعليق