EB NEWS/కొత్తగూడెం:
కొత్తగూడెం: హోలీ పండుగ సందర్భంగా కొత్తగూడెంలో పోలీస్ సిబ్బంది మధ్య ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్వయంగా పాల్గొని పోలీస్ సిబ్బందితో కలిసి సరదాగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన వేసిన స్టెప్పులు అక్కడున్న డాన్సర్లనే మైమరిపించేలా ఉండటంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా మారింది.
నిత్యం విధుల్లో నిమగ్నమై ఒత్తిడితో పనిచేసే పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఈ హోలీ వేడుకలు కాస్త రిలీఫ్‌ను అందించాయి. రంగుల మధ్య నవ్వులు, పాటలు, నృత్యాలతో పోలీసులు ఒక్కరోజు అయినా విధుల భారాన్ని మరిచి పండుగను ఆస్వాదించారు.
ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నారని, ఇలాంటి వేడుకలు వారిలో ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సిబ్బందితో కలిసి ఆనందంగా గడపడం తనకూ సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
మొత్తానికి హోలీ పండుగ కొత్తగూడెం పోలీస్ విభాగంలో ఉత్సాహాన్ని నింపగా, ఎస్పీ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి