మణుగూరులో భారీ ట్రాఫిక్ జామ్.. వాహనదారుల ఇక్కట్లు

G Rajashekar
By -
0


EB NEWS/మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో విజయనగరం నుంచి సీఎస్పీ వరకు లారీల రద్దీతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా గనుల ప్రాంతానికి సంబంధించిన భారీ లారీలు ఒకేసారి రాకపోకలు సాగించడంతో రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.


ఈ ట్రాఫిక్‌లో కార్లు, బైకులు, ఆటోలు గంటల తరబడి ఇరుక్కుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర పనుల కోసం వెళ్తున్న వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


స్థానికులు, వాహనదారులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా లారీల రాకపోకలను సమయపాలనతో నియంత్రించడం వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)