అశ్వాపురం మండలంలో ఆత్మహత్యాయత్నం

G Rajashekar
By -
0

 


EB NEWS/అశ్వాపురం:


అశ్వాపురం మండలం పరిధిలోని ఆనందపురం గ్రామానికి చెందిన బండారి పుల్లయ్య (సింహాద్రి) అనే వ్యక్తి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

ఘటన తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతన్ని వెంటనే మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.

ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన గ్రామంలో ఆందోళన కలిగించింది.



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)