EB NEWS/ఛత్తీస్‌గఢ్:
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్ట్ ఉద్యమానికి చెందిన మరో అగ్రనేత పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ వికాస్ సహా మొత్తం 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో కలిసి అధికారులకు లొంగిపోయినట్లు సమాచారం.
సాంబయ్య ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఆయనపై పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముండ్ జిల్లా, సరైపాలి సమీపంలోని బలోడా అడవులు ప్రాంతం నుంచి ఒక జర్నలిస్ట్ సంప్రదింపుల సహకారంతో సాంబయ్య టీం పోలీసులతో చర్చలు జరిపి లొంగిపోయినట్లు సమాచారం.
లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానాల ప్రకారం సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లొంగిపాటు మావోయిస్ట్ కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

إرسال تعليق