వాట్సాప్ చాట్ వివాదం.. కానిస్టేబుల్ దారుణ హత్య – 8 గంటల్లోనే నిందితుల అరెస్ట్

 


EB NEWS/తెలంగాణ:


హైదరాబాద్: నగరంలోని చిలుకనగర్ ప్రాంతంలో వాట్సాప్ చాట్ విషయంలో జరిగిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ కుమార్‌ను అతని స్నేహితులే కత్తులతో దాడి చేసి హత్య చేశారు.


పోలీసుల వివరాల ప్రకారం, సుధీర్ కుమార్‌కు స్నేహితుడు సంతోష్ నాయక్తో వాట్సాప్ చాట్ విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ వివాదం క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో సంతోష్ నాయక్ తన సహచరులతో కలిసి సుధీర్ కుమార్‌పై కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధీర్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా కేవలం 8 గంటల్లోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.


హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. 


Post a Comment

కొత్తది పాతది