EB NEWS/భద్రాద్రి:
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి జితేష్ వి. పాటిల్‌ను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జితేష్ వి. పాటిల్‌కు శాలువాతో సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అలాగే రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి