EB NEWS/ఖమ్మం :
భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 15 రోజుల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించి, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి పక్షాన నిలబడుతుందని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించిన మంత్రి, కేవలం స్థలాలు ఇవ్వడమే కాకుండా, అన్ని మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
అర్హులైన ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు.

إرسال تعليق