జర్నలిస్ట్ కప్ 2026 విజేతగా నిలిచింది ఎవరంటే...

 




 విజేతగా నిలిచింది బీటీపీఎస్ టీం...

రన్నర్స్ గా నిలిచిన ఏడూళ్ల బయ్యారం పోలీస్..


విజేతలకు బహుమతులు అందజేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి


EB NEWS/పినపాక:

పినపాక ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో గత ఐదు రోజులుగా ఎల్చిరెడ్డిపల్లి క్రికెట్ మైదానంలో నిర్వహించిన జర్నలిస్ట్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో బిటిపీఎస్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ప్రతిష్టాత్మక పోటీలో పోలీస్ జట్టు చివరి వరకు ధైర్యంగా పోరాడినప్పటికీ తృటిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన బిటిపీఎస్ జట్టు నిర్ణీత 8 ఓవర్ల లో 82 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బిటిపీఎస్ జట్టులో వెంకట్ 46 పరుగులు చేయగా, ఓపెనర్ గట్ల నవీన్ 26 పరుగులు చేయడంతో భారీ స్కోర్ చేసింది. లక్ష్య చేధనకు దిగిన పోలీస్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా, మధ్యవరుస బ్యాట్స్‌మెన్లు పోరాటపటిమ చూపించారు. అయితే చివరి ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోలేక మ్యాచ్‌ను కోల్పోయారు.

టోర్నమెంట్ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి అతిదులతో కలిసి విజేతలకు బిటిపీఎస్ జట్టుకు ట్రోఫీ అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన పోలీస్ జట్టుకి రన్నరప్ ట్రోఫిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలు గా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్ కి సహాయ సహాకారాలు అందించిన ప్రజాప్రతినిధులు,అధికారులు, జర్నలిస్టులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడాపోటీల ద్వారా స్నేహభావాన్ని పెంపొందించడమే తమ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. జర్నలిస్టులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం టోర్నమెంట్ ప్రత్యేకత అని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ప్రధమ బహుమతిని మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోస్ట్ వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పగడాల సతీష్ రెడ్డి స్పాన్సర్ చేయగా, ద్వితీయ బహుమతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు బూరా శంకర్, బిల్లా నాగేందర్, ముక్కు మహేష్ రెడ్డి, సనపా భరత్, కొంపెల్లి సంతోష్, బుయ్యవరపు భాస్కర్ గంగిరెడ్డి సతీష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم