EB NEWS/మణుగూరు:
మణుగూరు సింగరేణి గనిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్యాగ్‌తో కూడిన ఓ రేసింగ్ పావురం గనిలో కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
చెన్నై ప్రముఖ పావురాల రేసింగ్ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేసింగ్ పోటీల్లో భాగంగా ఈ పావురాన్ని మహబూబాబాద్ జిల్లాలో వదిలారు. సాధారణంగా ఈ రేసింగ్ పావురాలు వదిలిన ప్రాంతం నుంచి స్వయంగా తమ యజమాని నివాసానికి తిరిగి చేరుకోవడం ఈ పోటీ లక్ష్యం.
అయితే పోటీలో పాల్గొన్న ఈ పావురం ప్రయాణమధ్యలో దాహంతో మణుగూరు సింగరేణి గనిలో దిగింది. అక్కడ గమనించిన సింగరేణి సిబ్బంది వెంటనే ట్యాగ్‌ను పరిశీలించి విషయం గుర్తించారు.
తదనంతరం పోలీసులు సమక్షంలో ఆ పావురాన్ని అడవి శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పావురాన్ని సురక్షితంగా విడుదల చేస్తే అది మళ్లీ తన గమ్యస్థానమైన చెన్నై చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే రేసింగ్ పావురాల సామర్థ్యం మరోసారి చర్చనీయాంశమైంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి