BTPS సిఎస్ఆర్ నిధుల వినియోగంపై వివాదం

 



భూ నిర్వాసిత ప్రాంతాలకు అభివృద్ధి జాడలేదా? బిటిపిఎస్‌పై స్థానికుల ఆందోళన


EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం/ ప్రతినిధి రాజశేఖర్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని బిటిపిఎస్ పరిధిలో భూ నిర్వాసిత ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కేటాయించే సిఎస్ఆర్ నిధుల వినియోగంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తవుతున్నా, సమీప గ్రామాల్లో ప్రాథమిక వసతులు మెరుగుపడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. త్రాగునీరు, రహదారులు, వైద్య సదుపాయాలు, విద్యుత్ వంటి కీలక రంగాల్లో స్పష్టమైన అభివృద్ధి కనిపించకపోవడంతో “సిఎస్ఆర్ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి?” అన్న ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు కూడా పరిమిత స్థాయిలోనే నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సిఎస్ఆర్ నిధుల వినియోగంపై స్పష్టత ఇచ్చి, ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم