మేడారం హుండీ ఆదాయం మొత్తం ఎంతంటే...

G Rajashekar
By -
0

 


ములుగు జిల్లా, EB న్యూస్:


మేడారం జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీల లెక్కింపు పూర్తయ్యింది. ఈ నెల 5 నుంచి హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన లెక్కింపులో మొత్తం 828 హుండీల నుంచి రూ.12,25,83,269 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో సుమారు 400 మంది సిబ్బంది హుండీలను లెక్కించారు. నగదు తో పాటు విదేశీ కరెన్సీ, రద్దు చేసిన నోట్లు, వెండి, బంగారు ఆభరణాలు కూడా హుండీల్లో లభ్యమయ్యాయి. భక్తుల భక్తిశ్రద్ధకు ఇది మరో నిదర్శనంగా నిలిచింది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)