పినపాక: రాగి తీగను దొంగిలించిన ఐదు గురు వ్యక్తుల అరెస్ట్

 



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


258 కేజీల రాగి, ఒక కియా కారు, ఒక స్కూటీ , ఐదు సెల్ ఫోన్స్ స్వాధీనం 




పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు శనివారం డిఎస్పి వంగా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా విద్యుత్  ట్రాన్స్ఫార్మర్స్ లో ఉన్న రాగి తీయని దొంగిలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు తెలిపారు. 


ముద్దాయిల వివరాలు:


1) కెల్లా దుర్గా ప్రసాద్, s/o సీతయ్య, వయసు 35 సంవత్సరాలు, కులం: మున్నూరు కాపు, వృత్తి: పాత ఇనుప సామాను కొట్టు, r/o బొల్లారి గూడెం, పాల్వంచ, N/o శ్రీకాకుళం


2) మంత్రి దుర్గా ప్రసాద్, s/o గురుమూర్తి, వయస్సు 21 yrs, కులం: M/కాపు, వృత్తి: ఉల్లిగడ్డల వ్యాపారం, r/o నెహ్రు నగర్, పాల్వంచే N/o శ్రీకాకుళం


3) చింతపల్లి శివ, 50/0 పైడినాయుడు, age: 23 సంవత్సరాలు, వృత్తి: ఉల్లిగడ్డల వ్యాపారం R/C పాల్వంచ. N/o మచిలీపట్టణం


4)గనగళ్ల గణేష్ @ జగదీశ్, S/o రమణ, వయసు: 24 సంవత్సరాలు, కులం: వాడబలిజ, వృత్తి: డ్రైవర్ Ro పాల్వంచ, N/o పొన్నాడ గ్రామం, ఏచర్ల మండలం, శ్రీకాకుళం


5)కోరగటు నాగరాజు, s/o తిరుపతయ్య, వయసు: 29 సంవత్సరాలు, ST కోయ, వృత్తి: డ్రైవర్ / కొత్త సూరారం, పాల్వంచ


పై అయిదుగురు ఒక ఆర్గనైజడ్ గ్రూప్ గా మారి గ్రామీణ ప్రాంతాలలో పొలాల పక్కన ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్స్ ల నుండి రాగి ని దొంగలించాలనే ఉద్దేశ్యం తో మంత్రి దుర్గాప్రసాద్, చింతపల్లి శివ లుఇనుప, రాగి వస్తువులకు ఉల్లిగడ్డలకు అమ్ముతూ కొత్తగూడెం, ములుగు జిల్లాలో తిరుగుతూ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి అనేది పగటి పూట చూసుకొని, కెల్లా దుర్గా ప్రసాద్, గనగళ్ళ గణేష్ @జగదీశ్ మరియు కోరగట్టు నాగరాజు లతో కలిసి రాత్రి వేళల్లో పొలాలు దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్ల ను రేంచీలు /spanners సహాయం తో విడదీసి అందులోని రాగి ని దొంగలించుకుపోవడం చేస్తూ దొంగలించిన రాగిని పాల్వంచాలోని ఒక దగ్గర దాచి ఎక్కవ పోగు అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముకొని వచ్చిన డబ్బులను పంచుకొందామని అనుకున్నారు. ఈ క్రమంలో లోని దమ్మపేట, బూర్గంపాడు, అశ్వపురం, మణుగూరు, పస్రా, మంగపేట, పినపాక మండలంలో (సింగిరెడ్డి పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్స్ కలుపుకొని) మొత్తం గా 258 కేజీ ల రాగి ని దొంగిలించి పాల్వంచలోని చింతపల్లి శివ ఇంట్లో దాచిపెట్టి నిన్నటి రోజు సాయంత్రం మరలా కెల్లా దుర్గాప్రసాద్ కి సంబందించిన కియా క్యారెన్స్ కారు, స్కూటీ లపై ఈ అయిదుగురు కరకగూడెం లో కూడా ట్రాన్స్ఫార్లను దొంగలించడానికి వెళ్తుండగా ఉప్పాక స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీస్ SI &స్టాఫ్ పార్టీ ని చూసి వాహనాలను వెనక్కి తిప్పుతూండగా పోలీస్ వారు పట్టు కొని అడిగితే దొంగతనలా విషయం బయటపడింది. ముద్దాయిలలో కెల్లా దుర్గా ప్రసాద్, కోరగట్టు నాగరాజు లపై ఇది వరకు కాపర్ దొంగతనం కేసులు ఉన్నాయి. వీళ్లు దమ్మపేటలో 5, బూర్గంపాడులో 2, అశ్వాపురంలో 1, మణుగూరులో 1, పస్త్రా లో1, మంగపేటలో 1 మరియు ఏడనాల్ల బయ్యారం లో 2 మొత్తం (13) కేసులలో దొంగతనాలు చేసినారు. ముద్దాయిల నుండి 13 కేసులకు సంబందించిన 258 కేజీ ల రాగి, ఒక కియా క్యారెన్స్ కార్ No. TG2883999 మరియు నెంబర్ లేని పాత ఎరుపు స్కూటీ, 5 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సురేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم