చింతకాయల కోసం చెట్టెక్కి కింద పడిన మహిళ – పరిస్థితి విషమం- దాతలు ఆదుకోండి




కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో ఘటన


EB NEWS/కరకగూడెం:


చింతకాయల కోసం చెట్టెక్కిన ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామంలో చోటుచేసుకుంది.


గ్రామానికి చెందిన బేత సారక్క (55) శనివారం చింతపండ్లు సేకరించేందుకు గ్రామ సమీపంలోని చింతచెట్టుపైకి ఎక్కింది. చింతకాయలను రాల్చే క్రమంలో ఆమె కాలుజారి చెట్టు పై నుంచి కిందపడింది. ఈ ఘటనలో సారక్క తీవ్ర గాయాలపాలయ్యింది.


అవసరమైన వైద్యసాయం కోసం కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సారక్క కుటుంబం ఆర్థికంగా బలహీన స్థితిలో ఉంది. ఆమె చికిత్సకు సహాయం చేయాలనుకునే దాతలు 8639389265 నంబర్‌ను సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Post a Comment

కొత్తది పాతది