ఉమ్మడి ఖమ్మం , ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో నమోదైన 47 కేసులకు సంబంధించిన 953 కేజీల గంజాయిని సోమవారం అధికారికంగా కాల్చివేశారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.4.76 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ అనుమతి పొందిన తల్లేడ మండలం గోపాల్‌పేట్‌లోని ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ కాల్చివేత నిర్వహించారు.
ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఒకేచోట చేర్చి ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

إرسال تعليق