EB NEWS/ మణుగూరు:
మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామం వద్ద సోమవారం భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కర్రలతో రహదారిని మూసివేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
గ్రామస్తుల ప్రకారం, భారీ లారీల రాకపోకల వల్ల రహదారి పూర్తిగా గోతుల మయంగా మారిందని, దుమ్ము ధూళితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు.
రోడ్డు దిగ్బంధంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి