మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు నుంచి బీటీపీఎస్‌కు బొగ్గు రవాణా చేస్తున్న రెండు లారీలు టౌన్షిప్ ఎదుట ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందుగా వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయింది. స్థానికులు వెంటనే స్పందించి.. ఎలాంటి ప్రాణహాని లేకుండా అతడిని కాపాడారు.ఈ ప్రమాదంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ ఘటనపై ప్రజలు బొగ్గు లారీలు రోడ్లపై నియంత్రణ లేకుండా వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.

إرسال تعليق