EB NEWS/ఖమ్మం:
ఖమ్మం: ‘వెలుగుమట్ల’ బాధితులకు కేటీఆర్ భరోసా
వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — వారిని బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. “మీ కోసం పోరాడేందుకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. అసెంబ్లీలోనూ ఈ అంశంపై గట్టిగా పోరాటం చేస్తాం” అని స్పష్టం చేశారు.
వెలుగుమట్లకు కేటీఆర్ రావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.
బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

إرسال تعليق