EB NEWS/పాల్వంచ:
పాల్వంచలో శుక్రవారం జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన 16 ఏళ్ల విద్యార్థిని పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే కడుపునొప్పి ఉందని చెప్పి బాత్రూంకి వెళ్లింది. చాలా సేపటికీ బయటకు రాకపోవడంతో మహిళా ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చింది.
సిబ్బంది బాత్రూం తలుపు తెరిచి చూడగా అక్కడే ఆమె మృత శిశువుకు జన్మనిచ్చినట్టు గుర్తించారు. సమాచారం ప్రకారం, శిశువు మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా బేసిన్‌లో దాచినట్టు తెలుస్తోంది. ఘటన తెలిసిన వెంటనే పరీక్షా కేంద్రంలో ఆందోళన వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని గర్భవతిగా ఉన్న విషయం కుటుంబ సభ్యులకు తెలుసా? ఈ పరిస్థితి ఎలా ఏర్పడింది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
స్థానికంగా ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశమైంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి